Sunday, May 14, 2023

పొయ్యి లో పట్ట

మదిలో ఉన్న కోరిక ఎంత చిలిపిదైన ఒక్క సారి తీర్చుకోవలి అన్న కోరిక సహజం దాని వల్ల చేదు జ్ఞాపకాలు సైతం తియ్యనివి  
అలాంటిదే నాకు కలిగింది నా బాల్యం లో..

 
ఆ రోజు వర్షం కుండపోతగా కురుస్తుంది నేను వర్షం లో తడిచి ముద్దై వచ్చాను 
అప్పుడు నా వయసు ఎనిమిది మా ఊళ్ళొ అప్పట్లొ గ్యాసు ఎక్కడ ఉంది కట్టెల పొయ్యే కదా..
అందులో మండే ఒక ఎండు టెంకాయ పట్ట కాలుతుంది. దాన్ని నేను చూసాను.. 
మా అమ్మ పట్ట పైన ఆడుకుంటె మట్టి పూసుకుంటాను అని ఆట అంటె వాత అంటుంది..  



ఎవరు లేని సమయం కావటం వల్ల, నాకు అడ్డు అదుపు లేదనుకొని ఇంక ఎదో చెసేద్దమని 
పట్ట లాగాను అంతే దాని పైన సరా సరా కాగె చారు నా పైకి స్లో మోషన్లో ఎగిరి పడింది  
అంతె దెబ్బకు కుదిరింది నాకు, కాక పోతె ఆ వర్షనికి తడిచి రావటం వల్ల కాస్త హాయిగ అనిపించినా
ఎవరికి తెలియని గుండెలొ దాగిన ఈ అనుబవం ఎప్పటికి నేను మార్చి పోలెని తియ్యని చేదు జ్ఞపకం

Sunday, January 13, 2019

నా దేశం నా రాష్ట్రం నా ఊరు నా జాతి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా 
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా 
పొగడరా నీ తల్లి భోమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము --- గురజాడ వారు 

కానీ ఈ రోజు గౌరవం అన్న పదము గర్వాంగా మారింది.. ఇది మన లోని అజ్ఞానానికి పరాకాష్ఠ అని అనటం లో ఏ సందేహం లేదు. అవును మన దేశం మన రాష్ట్రము మరియు ఉనికిడి గూర్చి నలుగురు గౌరవంగా చెప్పుకోవాలి అనుకోవటం తప్పు కాదు కానీ దానికోసం మనం గర్వం అలవరచు కోవటం మూర్ఖత్వం. 

ఈ మధ్య జరిగిన ఎన్నో సభలు సన్నివేశాలు ఈ తీరుకు అద్దం పడుతూ అడ్డం పడుతున్నాయి అనటం లో చాలా సిగ్గుతో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు. ఎవరు ఎందుకోసం  చేసారు అన్నది ఈ రోజు ముఖ్యమైన అంశం కాదు కానీ ఏ ఉద్దేశం తో చేశారు అన్నది మాత్రం మన జీవన విధానాన్ని ప్రశ్నించే ఒక సూటి పోటీ అయినా మాట లాగ అనిపిస్తుంది. మనకు అందరికి తెలిసిన విషయం ఏంటి అంటే రాజకీయం ఈ రోజున మన ఒక జీవన విధానంగా మారింది ఇది మారాలి. రాజకేయం మనల్ని శాసించే విధానం మారాలి. అవును మన పాలన మనమే చేసుకోవాలి కానీ మనం ఈ రోజు రాజకీయాలకు బానిస అవ్వటం ఇవాల జగుతున్న మన ఆలోచనలో ఉన్న దౌర్భాగ్యం. ఎందుకు ఈ పరిస్థితి ఎవ్వరి కోసం మనకు ఈ ఇబ్బందికర వాతావరణం. ఒక్క సారి మన పునః పరిశీలించుకుందాం. 

కుచ్చు టోపీ అన్నపదం రాజకీయం లో ఉన్న ప్రతి ఒక్కరు వాడే పదం.  ఎవ్వరు ఈ టోపీ పెట్టుకోవటానికి ఒక్క సరి కూడా ఆలోచించకుండా చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అర్హత కావలి కావాలి రాజకీయాలకు కూడా కావాలి.  ఆలా అని అర్హుడైన ప్రతి ఒక్కరికి కుచ్చు టోపీ వెయ్యకూడదు ఎవరు రాజకీయాన్ని రాజకీయ్యంగా కాకుండా ప్రజల కోసం పరిపాలన సామర్థ్యం ఉందొ వాడిని నాయకుడు అంటారు. నాయకుడికి రాజకీయానికి చాలనే తేడా ఉంది ఆ వ్యత్సాన్ని గ్రహించి నాది అన్నది వదిలెయ్యటానికి సిద్ధంగా ఉండే నాయకుడికి ఎన్నుకోవటం మంచిది. 








 

Sunday, August 1, 2010

నంది కొండలు... నల్ల మొబ్బు నీడల్లో...

మిత్రులారా నాకు తెలుసు నేను ఇక్కడ పోస్ట్ చేసి చాలా రోజులయ్యింది, చాలా మంది మర్చిపోయి ఉంటారు అని కూడా తెలుసు .. అందుకే ఈ రోజు ఒక చిన్న అనుభవం మీతో పంచుకూవాలి అనుకుంటున్నాను...
ప్రయాణం

మొన్న కొన్ని రోజుల కిందట నేను నంది హిల్స్ కి (బెంగళూరు నుండి 45 కి.మీ దూరంలో ఉంది) కొంతమంది మిత్రులతో వెళ్ళాను. అక్కడ శుక్రవారం కావడంతో ఎవరూ లేరు దాదాపు.... మేము బెంగళూరు నుండి సాయంత్రం 3 కి బయలుదేరి అక్కడ వెళ్ళేసరికి 4 అయ్యింది. వెళ్ళే దారిలో బెంగళూరు లోని ఒత్తిడిని దాటి వెళ్ళినట్టుగా ఉంది.. మేము దేవనహళ్ళి వరకు 100 కి.మీ/గం స్పీడ్ తో డ్రైవ్ చేసి, అక్కడ నుండి చిన్న చిన్న ఊర్లను దాటుతూ చివరికి కొండ పైకి నడపసాగాను.. నడుపుతున్నంతసేపు అటూ దూరంగా కనిపించే దట్టమైన నల్లని మేఘాల చాటున దాగి ఉన్న విశాలమైన నంది కొండ పైన చలిగాలి వేసి కప్పుకున్నట్టుగా మేఘాల మబ్బులతో నిండిపోయింది.. ఆహా ఆ దృశ్యం చూసి మేము కాసేపు కారును ఆపేసి అలా ఉండిపోయాము.. ఆ తర్వాత చిన్నగా మబ్బులలోకి కారును నడుపుకుంటూ వెళ్ళిపోయాము...

టిప్పు సుల్తాన్ వేసవి అతిథి గృహం

మేము టికెట్ తీసుకొని కోట లోకి వెళ్ళగానే ఒక చిన్న కొలను కనిపించింది.. ఆ కొలను ఒంటరిగా బిక్కుబిక్కు మంటున్నట్టుగా ఉంది.. ఎవరూ లేని ప్రదేశం అది.. ఏదో సినిమా షూటింగ్ కోసం లొకేషన్ లాగా ప్రశాంతంగా ఉంది.. అక్కడ ఉన్న వాతావరణం చూసి నా మనసు ఎక్కడో సుదూర ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా ఉంది.. ఆ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అక్కడే ఎప్పటినుంచో గూడు చేసుకున్న కోతులు కూడా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ హాయిగా ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నట్టుగా ఉన్నాయి.. అక్కడికి కొంచెం దూరంలో టిప్పు సుల్తాన్ వేసవి అతిథి గృహం ఉంది. ఆ గృహం ఎప్పటినుంచో ఎవరూ లేకపోవడంతో "నా ఏకాంతాన్ని మీరు భగ్నం చేయకండి" అని చెప్పనక్కర్లేదని చెబుతున్నట్టుగా ఉంది..

మబ్బులతో ఆటలు...

ఆ సుందరమైన ప్రదేశం నుండి కాస్త పైకి వెళ్ళాము అంతే, మేము మబ్బులో ఉన్నట్టుగా పైన నుండి లోకం మొత్తాన్ని గమనించే బ్రహ్మలాగా చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఆస్వాదించాము.. ఆ ప్రదేశం లోనుండి ఆ చల్లని వర్షాన్ని మేము వెక్కిరిస్తున్నంత ఎత్తులో ఉన్నాము.. కింద ఉన్న భూలోకం తడిసి ముద్దవుతుంటే.. మేము ఆ మబ్బుల పైన స్వారీ చేస్తున్నట్లు... మబ్బులను "ఆ వైపుకు వెళ్ళు, ఈ వైపుకు వెళ్ళు" అని ఆదేశాలిస్తున్నట్టుగా ఉంది.. "నంది కొండల్లో వాగుల్లో నల్లమొబ్బు నీడల్లో" అన్న పాట ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు నా మిత్రుడు.. ఆ కొండ వాగుల్లో ఒక్కసారిగా మమ్మల్ని మేము మరచిపోయాము.. "ఈ మబ్బుల ముసుగును తీసి కాస్త సూర్యుడిని చూడనివ్వు మిత్రమా" అని మబ్బులతో ఎంత వేడుకున్నా.. "మిత్రమా, నాకు నేలను తడిపే పని ఉంది ఈ రోజు, నీకు అంత సమయం కేటాయించలేను" అన్నట్టుగా మబ్బులు సూర్యుడిని కప్పేసాయి.. కాసేపు సూర్యాస్తమయం కోసం వేచిచూసి మిత్రుడు "సరే మిరా" అనడంతో తిరిగి మా ప్రయాణం కొనసాగించాము.

ఎత్తైన భవనం, కమ్మని వంట...

ఆ విశాలమైన భూలోకం నుండి కాస్త ముందుకు రాగానే అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. అది నంది కొండలోని లోయకు కాస్త అంచున కట్టించారు.. ఆ దృశ్యం చూసి, వాతావరణం కూడా చల్లగా ఉండటంతో అక్కడ ఏదైనా కాస్త వేడివేడిగా తినాలి అనుకొని ఆ హోటల్లోకి చిన్నగా జారుకొని లోయకు పక్కగా కూర్చొని అక్కడ కొన్ని వేడివేడి వంటలు ఆర్డర్ చేసాము.. అటు లోయ, ఇటు చల్లని గాలి మధ్యలో వేడివేడిగా గోబీ, ఇంకేముంది కుమ్మేసాము.. ఇంతలో చిమ్మచీకటి కమ్మేసింది ఆ ప్రదేశం అంతా.. వీధి లైట్లు లేకపోవడంతో ప్రదేశం అంతా చీకటిగా ఉంది.. కాని అక్కడ నుండి చూస్తే ఇటు బెంగళూరు, అటు చిక్కబళ్ళాపూర్, ఇంకాస్త ముందుకు బాగేపల్లి చాలా అందమైన దీపాల అలంకరణతో ఉంచిన కార్పెట్ లాగా ఉంది. అప్పటికే టైం చాలా అయ్యిందటంతో వెనక్కు తిరిగి వస్తున్నంతసేపు సరదాసరదాగా నవ్వుకుంటూ దిగేసాము..

ఇదండి మా నంది కొండల అద్భుతమైన అనుభవం...

మీ,
కృష్ణ సి

Thursday, December 4, 2008

హైదరాబాదు లో నైజాము

నేను  ఇంజినీరింగ్ చదివే రోజుల్లో కొత్తల్లో హైదరాబాదుకు వొయ్యింటి ..


అప్పుడు నాకు తెలిసింది రెండే లక్డీకపూలూ, మియాపూరూ!!  
నేను పుస్కాలు కొనేదానికి హైదరాబాదుకు పని కట్టుకోని వోతి.
మీరు బానే న్నారు అనంతపురం నుంచి నేను పుస్కాలు కొనేదానికే వోతి.
ఆడవోతానె మా మామ "కోఠి కి బోలే, బో సిక్కుతాయి" అన్నాక వొయిడినే బస్సెక్కితి..


తే ఏంది అనుకుంట్రా? ఈడ్నే ఉంది మల్లా టిస్టు !!
నేను ఎక్కిన బస్సు కొఠి పోతాది కాని తిరుగు ప్రయాణం లో...  
ఆ బస్సు దిగితే మల్లా బస్సు ఎంతకుందో అన్నట్టు పఠాంచేరు దాక..ఆ... ఆ... అదే వయ్యా  
ఆడ నుంచి కోఠి వొయ్యాక ఆడజూస్తే అంగళ్ళు మూసేసారు...  


దీనెవ్వ అనుకొని మల్లా రోజు వొయ్యి తెచ్చుకుంటి... ఎంసేసిది బా నాకు సేత గాలా...